Home సినిమా సహనం కోల్పోయి చెప్పుతో కొట్టా

సహనం కోల్పోయి చెప్పుతో కొట్టా

Mumtaz

‘మీటూ’ ఉద్యమం రోజురోజుకు హీటెక్కుతోంది. పలువురు నటీమణులు ప్రముఖ స్టార్స్‌పై కూడా లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై నటి ముంతాజ్ స్పందించింది. తమిళ బిగ్‌బాస్‌తో అక్కడ బాగా పాపులర్ అయిన ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేసింది. “లైంగిక వేధింపుల జాబితాలో నేను కూడా ఉన్నాను. పలుసార్లు నేను లైంగికంగా వేధించబడ్డాను. అయితే వాటిని నేను ఓపిక ఉన్నంతవరకు భరించేదాన్ని. అంతకుమించి నన్ను లైంగికంగా వేధిస్తే మాత్రం సీరియస్‌గా స్పందించేదాన్ని. ఒక సినిమా షూటింగ్ సమయంలో నాతో దర్శకుడు పదే పదే అసభ్యంగా ప్రవర్తించడంతో సహనం కోల్పోయి అతన్ని చెప్పుతో కొట్టాను. అప్పుడు అంతా షాకయ్యారు. ఘాటుగా స్పందిస్తే తప్ప లైంగిక వేధింపుల నుండి ఆడవారు బయట పడలేరు”అని పేర్కొంది ముంతాజ్.

Tamil Actress Mumtaz Joins Mee Too Movement 

Telangana News