Home తాజా వార్తలు శ్రీరెడ్డిపై భారతీరాజా ఫైర్!

శ్రీరెడ్డిపై భారతీరాజా ఫైర్!

Bharathiraja fires on Sri Reddy

చెన్నై: గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. నిన్నటి వరకు టాలీవుడ్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకు పడగా, ఇప్పుడు కోలీవుడ్ నటీనటులపై ఆమె విమర్శలతో హల్ చల్ చేస్తున్నారు. కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్, సుందర్, నటుడు శ్రీరామ్, లారెన్స్ తదితరులు అవకాశాలు ఇస్తామంటూ ఆశ చూపి, తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆమెపై మండిపడ్డారు. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయన్నారు. కానీ, వాటితోనే ప్రచారం పొందాలని ఆమె అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. సినిమావారందరినీ శ్రీరెడ్డి తప్పుపట్టడం సరికాదని, ఎదుటివారిపై నిందలు వేసే కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు. ఇంతకుముందు కూడా శ్రీరెడ్డి పలువురు కోలీవుడ్ నటీనటులు, దర్శకులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎఆర్‌ మురుగదాస్, సుందర్‌.సి, నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్, శ్రీరామ్‌ తదితరులపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ  హెచ్చరించినా శ్రీరెడ్డిలో మార్పు కనిపించడం లేదంటున్నారు కోలీవుడ్ నటులు. ప్రస్తుతం ఆమె చెన్నైలో మకాం వేసి మరీ ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. తను చేస్తోన్న ఆరోపణలపై కోలీవుడ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.