Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

తమిళ సినీ, టివి నటి ఆత్మహత్య

Priyanka

ప్రేక్షకులకు సినిమా వాళ్ల జీవితాలు ఎంతో అద్భుతం గా కనిపిస్తాయి. కానీ వారి నవ్వుల వెనుక ఎన్ని బాధ లు, కన్నీళ్లు ఉంటాయో వారికి తెలియదు. ఆ బాధలు, కష్టాలను మోయలేక చెన్నైలో తమిళ సినీ, టివి నటి ప్రి యాంక బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న ఆమె ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నా పోలీసుల విచారణం లో ఏదీ నిర్ధారణ కాలేదు. ఈ దుర్ఘటన కోలీవుడ్‌లో కలకలం రేపింది. తమిళ బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ప్రియాంక పలు సినిమాల్లోనూ నటించింది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘వంశం’ సీరియల్‌లో ఆమె నటించి మంచి పేరుతెచ్చుకుంది. ఇక ప్రియాంకకు పెళ్లయి మూడేళ్లయినా సంతానం లేదు. ఆ మనోవేదనలో ఆమె ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. బహుశా ఆత్మహత్యకు అదే కారణం కావచ్చని కొందరు అంటున్నారు.

Comments

comments