Home తాజా వార్తలు తమిళనాడు సిఎంగా శశికళ?

తమిళనాడు సిఎంగా శశికళ?

SASIKALA

చెన్నయ్ : తమిళనాడు సిఎంగా అన్నాడిఎంకె ప్రధానకార్యదర్శి శశికళ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఎం పన్నీరు సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పోయోస్ గార్డెన్‌లో శశికళతో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం నుంచి అన్నాడిఎంకెలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పోయోస్ గార్డెన్‌లో అన్నాడిఎంకె శాసనసభా పక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో అన్నాడిఎంకె శాసనసభా పక్ష నేతగా శశికళను ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. శశికళను సిఎంగా తమిళ ప్రజలు అంగీకరించరని జయలలిత మేనకోడలు దీపతో పాటు, ప్రతిపక్షనేత, డిఎంకె వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు సిఎం పన్నీరు సెల్వం కూడా ముందు సిఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారని వార్తలు వచ్చాయి. అనంతరం ఆయన కూడా మనస్సు మార్చుకున్నారని, ఈ క్రమంలోనే తాను అలవంటివాడినని, తన చేతుల్లో ఏమీ లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శశికళ తమిళనాడు సిఎంగా రెండు,మూడు రోజుల్లో పదవి చేపట్టే అవకాశం ఉందని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు.