Home జాతీయ వార్తలు సంయమనం పాటించండి : స్టాలిన్

సంయమనం పాటించండి : స్టాలిన్

Chennai : Tamil Nadu Government Insulting the Karunanidhi

చెన్నయ్ : డిఎంకె చీఫ్, తమిళనాడు మాజీ సిఎం కరుణానిధి మృతితో తమిళనాడు మూగబోయింది. చెన్నయ్‌లోని రాజాజీ హాల్‌లో కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచారు. కరుణానిధిని కడసారి చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున రాజాజీ హాల్ వద్దకు తరలివస్తున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. అభిమానుల తాకిడితో రాజాజీ హాల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలో కరుణానిధి తనయుడు, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందించారు. పార్టీ కార్యకర్తలకు, అభిమానులు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకుండా తమిళనాడు సర్కారు కరుణానిధిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు భద్రత కలిపించకపోయినా, అంతిమయాత్రకు సహకరించాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. రాజాజీ హాల్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీ శ్రేణులు, అభిమానులు సహకరించాలని ఆయన సూచించారు.

Tamil Nadu Government Insulting   the Karunanidhi