Home స్పెషల్ ఆర్టికల్స్ రాజకీయాల్లోకి కబాలి..?

రాజకీయాల్లోకి కబాలి..?

Rajinikanth

చెన్నై: ప్రస్తుతం తమిళనాట రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఓ వైపు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, మరోవైపు శశికళ మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఈ సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారనే ఊహగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఊహగాలకు కారణం ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి సూపర్‌స్టార్‌తో భేటీ కావడమే.

ఈ సందర్భంగా ఆయన రజనీతో పార్టీ పెట్టి క్రియాశీల రాజకీయాలోకి రావడానికి ఇదే సరైన సమయమని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రజనీకి సిఎం పదవి ఆశ చూపెడుతోందట. అయితే బిజెపి ఆఫర్‌పై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో బిజెపి ఆఫర్‌పై రజినీకాంత్ చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే రజనీ అభిమానులు మాత్రం ఈ ఊహగానాల నేపథ్యంలో కబాలి’స్ టైమ్ స్టార్ట్స్ అంటూ పండుగ చేసుకుంటున్నారు.