Search
Friday 16 November 2018
  • :
  • :

విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన టివి నటుడు

Sai-Prashanthచెన్నై: తమిళ టివి నటుడు సాయి ప్రశాంత్ చెన్నైలోని తన నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రశాంత్ డ్రింక్లో విషం కలుపుకొని తాగినట్టు పోలీసులు నిర్ధారించారు. వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన సాయి ప్రశాంత్ అన్నామలై, సెల్వీ, అరసి వంటి టెలివిజన్ సీరియళ్లలో నటించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, బహుశా అతని ఒంటరితనమే కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రశాంత్ మూడునెలల క్రితం మరో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments