Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

అడ్డంగా దొరికిన అమ్మాయి

girlకోయంబత్తూరు: 22 ఏళ్ల అమ్మాయి తను ప్రేమించిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంతో తల్లిదండ్రులు అమ్మాయి కోసం పెళ్లి సంబందాలు చూడటం మొదలు పెట్టారు. విషయం తెలిసిన అమ్మాయి… తన తల్లిదండ్రులు ప్రయత్నాన్ని ఎలా అయిన విరమింప జేయాలని నాటకానికి తెర లేపింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడులో హాస్టల్‌లో ఉంటు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. జులై 28 న హాస్టల్‌లో కాళ్లు, చేతులు బంధించి ఉన్న అమ్మాయిని హస్టల్ సిబ్బంది గుర్తించి ఏం జరిగిందని అడగగా… తనను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి బంధించారని తెలిపింది. దీంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ చేరుకొని అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. విచారణ ప్రారంభించిన పోలీసులు అమ్మాయిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో గట్టిగా మందలించడంతో అమ్మాయి నిజం చెప్పింది. అసలు ఏం జరిగిందంటే… తనను అత్యాచారం చేశారని తెలిస్తే సంబంధాలు రావని.. అలా అయితే తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది.

Comments

comments