Home జాతీయ వార్తలు జల్లి ‘జన’కట్టు

జల్లి ‘జన’కట్టు

జల్లికట్టు నిషేధానికి నిరసనగా చెన్నైలో జనసంద్రం
విద్యార్థులు, ఐటి ఉద్యోగులతో మెరీనాబీచ్ కిటకిట
ఆందోళనకారులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు
నిషేధం ఎత్తివేత ఆర్డినెన్స్ కోసం నేడు ప్రధాని మోడీని కలుసుకోనున్న సిఎం పన్నీర్‌సెల్వం, ఎంపిలు
20న బంద్‌కు పిలుపు, జోక్యం చేసుకోమన్న హైకోర్టు

జోక్యం చేసుకోం : మద్రాసు హైకోర్టు
జల్లికట్టు క్రీడ నిషేధం వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలన లో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని మద్రాసు హైకోర్టు బుధవారం ప్రకటించింది. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా మెరీనాలో జరుగుతున్న నిరసనలను గురిం చి న్యాయవాది కె.బాలు ప్రస్తావించగా కోర్టు పై విధంగా స్పందించింది. శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న చోట విద్యుత్ సరఫరా నిలిపివేశారని, నిరసనకారులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆయన ఫిర్యా దు చేశారు. చీఫ్ జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం. సుందర్ తో కూడిన బెంచి ‘ఈ దశలో తాము జోక్యం చేసుకోబో మని’ ప్రకటించింది. కాగా పొంగల్ పండుగకు ముందే జల్లికట్టు క్రీడపై తీర్పు చెప్పవలసిందిగా చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు 2014లో జల్లికట్టును నిషేధించింది. రాష్ట్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌ను గత డిసెంబర్‌లో కొట్టివేశారు. నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Strike on Jallikattuచెన్నై : తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు మద్దతుదా రుల నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు చెన్నై తీరంలోని మెరీనా బీచ్ ఇసుకతినెన్న లపై గుమికూడి నిరసన తెలిపారు. రాజధానిలోని మెరీనా బీచ్ జల్లికట్టు ఆందోళనకు కేంద్రంగా మారింది. కొంతమంది యువకులు మెరీనా వద్ద మంగళవారం రాత్రంతా నిరసనలు జరిపారు. జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న యువత ఆందోళన ఉద్ధృతమవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ అగ్రశ్రేణి నాయ కత్వం బుధవారం సమాలోచనలు జరిపింది.

అనాదిగా వస్తున్న తమిళుల సంప్రదాయ క్రీడ నిర్వహణకు అనుమ తిస్తూ ఆర్డినెన్స్ జారీచేయవలసిందిగా కోరేందుకు ప్రధా ని నరేంద్ర మోడీతో గురువారం సమావేశం కావాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించారు. ఆయన వెంట అన్నాడిఎంకెకు చెందిన 51 మంది ఎంపీలు కూడా ప్రధానివద్దకు వెళతారు. నిరసనలు విరమించు కోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. మరోవైపు ఐటి రంగానికి చెందిన ఉద్యోగులు, పలువురు సినీనటులు జల్లికట్టు అనుకూల ఉద్యమంలో చేరారు. మదురై, శివగంగ, పడుకొట్టాయ్ జిల్లాలలో లాంఛన ప్రాయంగా ఎద్దులను వదిలి జల్లికట్టు క్రీడను నిర్వహిం చారు. రామేశ్వరంలో కూడా ప్రదర్శనలు జరిగాయి. తమిళ సంస్కృతికి ప్రతీక అయిన జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మదురైలోని అలంగన ల్లూర్, తముక్కమ్ మైదానానికి జనం తండోపతండా లుగా తరలివచ్చారు. జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పేటాపై నిరసనకారులు విరుచుకుపడ్డారు. దానిని మూసివేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు విద్యార్థు లు ఆత్మాహుతికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారి ప్రయత్నాన్ని వమ్ముచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చర్చలు

కాగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆందోళనకారులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో ఎద్దులను మచ్చిక చేసుకునే జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది. దీనిపై ఒక ఆర్డినెన్స్ జారీచేయ వలసిందిగా రాష్ట్రపతిని కోరనున్నట్లు ప్రభుత్వం తెలిపిం ది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్ర మత్స శాఖ మం త్రి డి.జయకుమార్, మరో క్యాబినెట్ మంత్రి కె.పాండ్య రాజన్‌తో కలసి నిరసన తెలుపుతున్న యువత ప్రతినిధు లతో చర్చలు జరిపారు.

జల్లికట్టుకు మద్దతుగా శుక్రవా రం ఉదయంనుంచి సాయంత్రం వరకు బంద్ జరపాలని తమిళ సంస్థల కార్యాచరణ కమిటి పిలుపునిచ్చింది. కాగా జల్లికట్టుపై నిషేదం ఎత్తివేయాలని సుప్రీం కోర్టును కోరేందుకు తమిళనాడు అసెంబ్లి ప్రత్యేక తీర్మానం చేసేం దుకు అన్నాడిఎంకె సన్నాహాలు చేస్తోంది. ‘అంతేకాదు. రాష్ట్రపతితో సమావేశమై ఆర్డినెన్స్ జారీ చేయవలసిందిగా కోరేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోగలదని’ మంత్రి జయకుమార్ యువతకు తెలిపారు. పొంగల్ పండుగ సందర్భంగా జల్లికట్టు నిర్వహణకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేయవల సిందిగా తమిళనాడు ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. మదురై దగ్గరి అలంగన ల్లూర్‌లో 200 మందిని సోమవారం అరెస్టు చేశారు.