Home వికారాబాద్ తాండూరు మున్సిపల్‌లో ఆసరా కుంభకోణం!

తాండూరు మున్సిపల్‌లో ఆసరా కుంభకోణం!

 

municipal

2 వేల పింఛన్లకు లెక్కలు లేవు
అధికారుల పకడ్బందీగా విచారణ
రికవరీకి కుదరని ఆడిట్

మన తెలంగాణ/తాండూరు : తాండూరు మున్సిపల్‌లో గత కొంత కాలంగా కొనసాగుతున్న అసరా ఫించన్‌ల దుర్వినియోగంపై తవ్విన కొద్ది బయటపడుతున్నాయి.ఇప్పటి వరకు సుమారు 2వేల మంది బోగస్ లబ్దిదారుల పేరుతో అసరా ఫించన్‌లు కాజేసినట్లు అధికారులు తేల్చారు.అయితె ఇందుకు సంబందించిన ఆడిట్ లెక్కలు తేల్చలేక పోతున్నారు.మున్సిపల్ ఆడిట్ ప్రకారం 2 వేల ఫించన్‌లు కాజేసినట్లు లేవు,దీంతో విచారణ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.అసరా ఫించన్‌ల స్వాహా అయినట్లు అప్పట్లో ఆరోపణలపై అప్పటి మున్సిపల్ కమీషనర్ గోపయ్య,అకౌంటెంట్ సుదాతన్‌బాబులపై కేసులు నమోదు చేశారు.ఆసరా ఫించన్‌ల పంపిణిలో బాగంగా ఐకేపి ఉద్యోగి మహేష్ కుమార్ రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసింది.దీనిపై విచారణ నిర్వహిస్తున్న అధికారులు ఆడిట్ చేస్తున్నారు.తాండూరు మున్సిపల్ పరిధిలోని 31 వార్డులలో కలిపి మొత్తం 6200 ఆసరా ఫించన్‌లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది.ఆసరా ఫించన్‌ల పంపిణి ముందుగా స్థానిక కౌన్సిలర్‌లకు ప్రయివేటు ఉద్యోగులకు అప్పగించారు.అయితె ప్రతి వార్డులలో ఉన్న బోగస్ లబ్దిదారులకు సంబందించిన ఫించన్‌లను కౌన్సిలర్‌లు అప్పటి కమీషనర్ కలిసి స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.మొత్తం 31 వార్డులలో కలిపి సుమారు 2 వేల బోగస్ అసరా ఫించన్‌లు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.స్వాహా చేసిన ఆసరా ఫించన్‌ల రికవరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.దీనిపై కసరత్తు చేస్తున్న విచారణ అధికారులకు మున్సిపల్‌లో ఆడిట్ బుక్కులు లభించడం లేదు.ప్రస్తుత కమీషనర్ బోగేశ్వర్‌రావుతో కలిసి ఆడిట్ బుక్కులు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.అయితె అప్పట్లో ఎలాంటి లెక్కలు లేకుండానే అసరా ఫించన్‌లను కాజేసినట్లు అధికారులు గుర్తించారు.దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి రికవరి చేయడానికి అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.దీంతో మున్సిపల్ కు మరింత అదాయం పెరిగే అవకాశం ఉంది.