Home లైఫ్ స్టైల్ డిజిటల్ తన్మయం

డిజిటల్ తన్మయం

b

ఏదైనా పని ఇష్టంతో చేసినప్పుడు దానికి వయసు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడు 14 ఏళ్ల తన్మయ్ భక్షి. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కుడైన ఐబిఎమ్ వాట్సన్ పోగ్రామర్. ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ కంపెనీలో నెలకు రూ.66 లక్షల జీతంతో పనిచేస్తున్నాడు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగం డిజిటల్ స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటాయని చెబుతున్నాడు భక్షి. అంతేకాదు తన్మయ్ కీనోట్, టెడ్‌ఎక్స్ స్పీకర్. అల్గారథిమిస్ట్. రచయిత. వాట్సన్, కాగ్నిటీవ్ డెవలపర్. ఎడ్యుకేషనల్ యూట్యూబర్. ఐబిఎమ్ క్లౌడ్ గౌరవ సలహాదారుడు. తన్మయ్ భక్షి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి సిఇవో, హెడ్ డెవలపర్… ఇలా చెప్పుకుంటూ పోతే తన్మయ్ గురించి తెల్సుకోవాల్సింది చాలానే ఉంది.

తన్మయ్ కుటుంబం ఉద్యోగరీత్యా 2004లో కెనడాలోని బ్రాంప్టన్‌లో సెటిలయింది. తన్మయ్ భక్షి 2003 లో ఇండియాలోనే పుట్టాడు. తండ్రి పునీత్ ఎ ట్రక్కింగ్ కంపెనీలో కంప్యూటర్ ప్రోగ్రామర్. వారాంతంలో పునీత్ సైన్స్, లెక్కల సబ్జెక్టులను నైట్ ట్యూషన్లు చెబుతాడు. తల్లి సుమిత గృహిణి. అక్క కెనడా యూనివర్సిటీలో చదువుతోంది. తన్మయ్ తన తండ్రి దగ్గర ఐదేళ్లకే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్నాడు. తొమ్మిదేళ్లకు మొదటి ఐవోఎస్ యాప్‌ను తయారుచేశాడు. 12 ఏళ్లకు ప్రపంచంలోనే అతిపిన్న వయసులో ఉన్న ఐబిఎమ్ వాట్సన్ ప్రోగ్రామర్‌గా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. చిన్నవయసులోనే తన్మయ్ భక్షి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. యాప్స్‌ను తయారుచేశాడు. దాదాపు లక్షమంది కోల్డర్స్‌ను ఎడ్యుకేట్ చేయడం తన లక్షమని చెబుతుంటాడు. 2016లో జరిగిన ఐబిఎమ్ డెవలపర్ కనెక్ట్ ప్రోగ్రాంలో తన కొత్త ఆల్గారిథమ్ గురించి చెప్పాడు. తను రూపొందించిన ‘ఆస్క్ తన్మయ్’ అనే తన వెబ్‌సైట్‌ను అక్కడ అందరికీ పరిచయం చేశాడు.
తన్మయ్ తన 5ఏళ్ల వయసులోనే స్విఫ్ట్, విబి, జావా, సి ప్లస్‌లాంటి మిగతా లాంగ్వేజస్‌లో కోడింగ్ చేయడం మొదలుపెట్టాడు. 9ఏళ్లప్పుడు ఐఫోన్‌లో టిటేబుల్స్ అంటూ ఓ యాప్‌ను తయారుచేశాడు. తన్మయ్ టీచస్ అంటూ యూట్యూబ్ చానల్‌ను ఏర్పాటు చేశాడు. ఆస్క్ తన్మయ్ అనేది వరల్డ్ ఫస్ట్ వెబ్ బేస్డ్ ఎన్‌ఎల్‌క్యూఏ సిస్టమ్‌గా పేరుతెచ్చుకుంది. తన్మయ్ ఇంటి దగ్గర ఉండే చదువును కొనసాగిస్తున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి టెన్నిస్ ఆడటం అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. తను రాసిన ‘హల్లో స్విఫ్ట్’ అనే పుస్తకంలో ఐవోఎస్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్‌ను కిడ్స్, డెవలపర్స్ కోసం రాశాడు. ప్రపంచం మరింత మంది డెవలపర్స్‌ను కోరుకుంటుంది అంటాడు తన్మయ్. 15 ఏళ్ల నుంచి 40ఏళ్ల వరకు అందరూ తన్మయ్ స్వీచస్ యూట్యూబ్ సబ్‌స్రైబర్లుగా ఉన్నారు. వారు అది విని తమ సందేహాలను తీర్చుకుంటున్నారు. తను రాసిన పుస్తకానికి అబితాబ్‌బచ్చన్ సంతకం పెట్టడం చాలా ఆనందాన్ని కలిగించిందంటాడు.
2016లో లాస్‌వెగాస్‌లో ఐబిఎమ్ ఇంటర్నెట్ కార్యక్రమంలో కీనోట్‌పై ప్రసంగించాడు. అక్కడే ఆస్క్ తన్మయ్ అనే వెబ్‌ను ప్రదర్శించాడు. అదే ఏడాది జూన్‌లో బెంగళూరులోని ఐబిఎమ్ డెవలపర్ కనెక్షన్‌కి కీనోట్‌పై ప్రసంగించాడు. ఇటీవల నయాగరాలో జరిగిన ఎన్‌ఎల్‌సీ ( నేషనల్ లీడర్‌షిప్ కాన్ఫెడన్స్) లో ప్రసంగించాడు.ఐవోటి ఎనేబుల్ పరికరాలను రూపొందించడానికి ఐబిఎమ్ వాల్మాట్ నుంచి తన సలహాదారులతో కల్సి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం గూగుల్‌లో పనిచేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎక్స్‌పర్ట్‌గా ప్రపంచంలో గుర్తింపు పొందాడు. ఫిన్‌లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించాడు. చిన్నప్పటి నుంచే ఇంటర్‌నెట్‌ను సొంతంగా ఉపయోగించడం నేర్చుకున్నాడు. కోడింగ్ తెలుసుకున్నాడు. పుస్తకాలను చదివేవాడు. ప్రోగ్రామింగ్ చేసేవాడు. తన యూట్యూబ్‌లకు దాదాపు రెండు లక్షల మంది సబ్‌స్రైబర్లు ఉన్నారు. 2017లో దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దుబాయ్ రాజు నుంచి నాలెడ్జ్ అంబాసిడర్ అనే అవార్డును అందుకున్నాడు. గూగుల్‌లో 1.2 మిలియన్స్ జీతంతో పనిచేస్తున్నాడు. తన్మయ్ గూగుల్ ఇంటర్వూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూండటం గమనార్హ ం.