Home తాజా వార్తలు ఐపిఎల్ ప్రచారకర్తగా తారక్!

ఐపిఎల్ ప్రచారకర్తగా తారక్!

NTR

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఐపిఎ-2018(ఇండియన్ ప్రీమియర్ లీగ్) తెలుగు ప్రాసారాలకు తారక్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా ‘బిగ్‌బాస్’ షోతో బుల్లితెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. దీనికి విశేషమైన ఆదరణ లభించడంతోపాటు అత్యధిక టిఆర్పి రేటింగ్ పొందిన తెలుగు షోగా నిలిచింది. త్వరలో ప్రారంభం కాబోతున్న రెండో సీజన్‌కు న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు.