Home ఆఫ్ బీట్ తాజాగా ‘తర్కారి వాలీ’

తాజాగా ‘తర్కారి వాలీ’

Beauty

పాకిస్థాన్ నీలికళ్ల ‘చాయ్‌వాలా’ తరహాలోనే ఇప్పుడొక కొత్త ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా నేపాలీ తర్కారివాలీ (కూరగాయలు అమ్మే యువతి) నెటిజన్ల హృదయాలను ఉర్రూతలూగిస్తోంది. ముగ్ధమోహనరూపంతో ఉన్న ఆమె ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ‘తర్కారివాలీ’ హ్యాష్‌ట్యాగ్‌తో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం రూపచంద్ర మహాజన్ అనే నెటిజన్ ఈ ‘తర్కారివాలీ’ ఫొటోలను తీశాడు. గోర్ఖా, చిత్వాన్ బ్రిడ్జి వద్ద చేపల పట్టే ప్రదేశంలో ఈమె కూరగాయలు అమ్ముతూ కనిపించింది. అందం, ఆత్మవిశ్వాసంతోపాటు కష్టించి పనిచేస్తున్న ఆమె నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.