Search
Wednesday 14 November 2018
  • :
  • :

చినుకు పడితే చిత్తడే..

Taru Road Damaging In Sunket Village In Nizamabad District
మోర్తాడ్‌ః మండలంలోని సుంకేట్ గ్రామంలోని తాండ రోడ్డు చినుకు పడితే చిత్తడిగా మారి అధ్వానంగా తయారైంది. దింతో తాండవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. 25 కుటుంబాలు ఉన్న తాండవాసులు ప్రతి నిత్యం గ్రామానికి ఆయా పనులపై రాకపోకలు సాగిస్తుంటారు. గత మూడు రోజులుగా ముసురు వర్షం కురియడంతో ప్రధాన మట్టి రోడ్డుపై నీరు చేరి బురద మయంగా మారడంతో రాకపోకలకు అలాగే కాలినడకన కూడా వెళ్లేలేని పరిస్థితి నేలకోందని తాండవాసులు తమ అవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాండరోడ్డు చెరువుకు ఆనుకోని ఉండటం,ప్రధాన కాలువ పక్కన నుండే తాండ రోడ్డు కోన్ని ప్రాంతాల్లో కుంగిపోవడంతో భయందోళనకు గురవున్నారు. మట్టిరోడ్డు కోంత మేరకు కబ్జాకు గురవుతున్నదని పేర్కొన్నారు. ఈసందర్భంగా తాండవాసులు మాలవత్ సుధీర్ మాట్లాడుతూ గత కోన్ని సంవత్సరాలుగా తమ నివాస ప్రాంతానికి సరైన రోడ్డుమార్గం లేకపోడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నమని అన్నారు. రోడ్డు నుండి తాండ వరకు బిటి రోడ్డు నిర్మించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులకు విన్నపించిన పట్టించుకోవడంలేదని అరోపించారు. ఇప్పటికైనా తమ సమస్యను ప్రభుత్వఅధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోని సమస్యను పరిష్కారించాలని అయన కోరారు.

Comments

comments