Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

గుండెపోటుతో పినపాక తహసీల్దార్ మృతి

MRO-Prasad-Rao

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కొత్తగూడెం పరిధిలోని పినపాక తహసీల్దార్  ప్రసాదరావు(57) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం ఉదయం సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో వాకింగ్ కు వెళ్లిన ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో  ప్రసాదరావును వెంటనే  సింగరేణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.  ప్రసాదరావు మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ప్రసాదరావు మరో రెండు నెలల్లో రిటైర్ అయ్యేవారని తెలుస్తోంది.

Comments

comments