Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

త్వరలో టాటా కైట్

Tata-Kite-Hatchback-Render-in-Yellowదేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మరో కొత్త కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్ట నుంది.   టాటా ‘కైట్ ’ అనే కొత్త కారును త్వరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. హ్యాచ్‌బ్యాక్ మోడల్ చెందిన  కైట్ అనే కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లకు చెందినది. అయితే, దీని ఇంజన్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఈ కారు 1.0లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్, మూడు సిలిండర్ల గల డీజిల్ ఇంజిన్‌లు ఉన్నాయి. ఇది 64.1బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసి, 140.27 ఎన్‌ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.  ఈ కారుకు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉంది. ఈ కైట్ మోడల్ కారును ఇండికా ఇవి2 ఆధారంతో రూపొందిస్తున్నారు. పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, ఆడియో సిస్టమ్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఎబిఎస్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీనిని ఇంటీరియర్ డిజైన్, టాటా మోడల్స్ అయిన టాటా బోల్ట్, టాట్ జెస్ట్ కార్ల ఇంటీరియర్ డిజైన్ ప్రేరణతో దీనిని తయారుచేశారు. మొత్తం మీద, ఈ కారు  డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు అంచనా ధర రూ. 3.9లక్షలు నుంచి రూ.4.5లక్షల వరకు ఉంటుంది.

Comments

comments