Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎయిర్‌టెల్ చేతికి టాటా టెలీ

 రుణ, నగదు రహితంగా ఒప్పందం 

 రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన

airtelన్యూఢిల్లీ: టాటా టెలిసర్వీసెస్ భారతీ ఎయిర్‌టెల్‌లో విలీ నం కానుంది. నష్టాల్లో కూరుకుపోయిన టాటా గ్రూప్‌కు చెందిన టాటా టెలిసర్వీసెస్‌ను విక్రయించే విషయమై నా లుగు నెలలుగా చర్చలు జరుగున్నాయి. ఎయిర్‌టెల్‌తో టాటా కంపెనీ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. టెలికాం దిగ్గ జం ఎయిర్‌టెల్ టాటా టెలిని సొంతం చేసుకోబోతోంది. ఈ విషయంపై ఇరు కంపెనీలు అధికారిక ప్రటకన వెలు వరించాయి. టాటా టెలీసర్వీసెస్, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్‌లో విలీనమవుతుందని కంపెనీలు ప్రకటించా యి. భారతీ ఎంటర్‌ప్రైజ్ అధినేత సునిల్ మిట్టల్‌తో నాలు గు నెలల పాటు చర్చలు జరిపిన టాటా గ్రూప్, తమ వైర్ లెస్ మొబైల్ వ్యాపారాలను ఎయిర్‌టెల్‌లో విలీనం చేయా లని నిర్ణయించింది. ఈ ఒప్పందంలో భాగంగా టాటాకు చెందిన రూ.10వేల కోట్ల స్పెక్ట్రమ్ బాధ్యతను కూడా భారతీ తీసుకోబోతుంది. టాటా టెలి దేశవ్యాప్తంగా 19 సర్కిళ్లలో 800, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండుల్లో 180 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం భారతీ బోర్డు సమావేశమైందని, ఈ ప్రతిపాదనను అంగీకరించింది. భారతీ బోర్డు అంగీ కారం అనంతరం ఈ విషయంపై ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో టిటిఎస్‌ఎల్(టాటా టెలిసర్వీసెస్), టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర (టిటిఎంఎల్)కు చెందిన 4 కోట్ల మంది కస్టమర్లు ఎయిర్‌టెల్ సొంతం కానున్నారు. దీంతో భారతీ ఎయిర్‌టెల్ ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద టె లికామ్ మార్కెట్‌గా ఆవిర్భవించనుంది. ఈ డీల్ రుణ రహిత, నగదు రహితంగా జరుగుతుందని, గతంలో ఉన్న అప్పులు, ఇతర విషయాలను టాటా పరిష్కరించనుందని కంపెనీలు ప్రకటన లో తెలిపారు.
దేశీయ మొబైల్ పరిశ్రమలో ఇది గొప్ప ఒప్పందమని, అదనపు స్పెక్ట్రమ్ స్వాధీనంతో వ్యాపారం మరింత ఆకర్ష ణీయంగా మారనుందని ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్ట్లల్ అన్నారు.

Comments

comments