Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మరో ఆభరణంగా టాటూ

tattooఎప్పుడెలా ప్రారంభమైనా పచ్చబొట్టు ఫ్యాషన్‌గా మారి చాలాకాలమే అయ్యింది. ఆ తర్వాత రానురాను స్టయిల్‌కు చిహ్నంగా మారింది. ఇంతకాలం వాచీమాటునో, పుల్‌హ్యాండ్స్ స్లీప్స్ చాటునో దాగిన పచ్చబొట్లు ఇపుడు శరీరానికి ఆభరణాల్లా మారాయి. ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి. భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. సందేశాలను మోసుకొస్తున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరమంతా పచ్చబొట్లు (టాటూలు) పొడిపించుకుంటున్నారు. ఒకప్పుడు వీటినే పచ్చబొట్టు అనేవారు. ఇది కేవలం ఆకుపచ్చ లేదా నలుపు రంగుల్లో మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇంక్‌తో అనేక రంగుల్లో టాటూలు వస్తున్నాయి. గ్రీన్, రెడ్, బ్లాక్ ఇలా ఎనిమిది రంగుల్లో లభిస్తున్నాయి. చీకట్లో మెరిసేలా రేడియం టాటూలు కూడా వేయించుకుంటున్నారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. శరరీంపై టాటూ వేయడం అత్యంత పురాతనమైన కళ. ఒక వ్యక్తి శరీరంలోని ఏదో ఒక భాగంలో సదితో గుచ్చి రంగులతో డిజైన్లు వేయటమనే ఈ కళ కొన్ని తెగలలో సంప్రదాయకంగా వస్తుందే. ప్రాచీన ఈజిప్టు నాగరికత అంత పూరాతనమైనది ఈ పచ్చబొట్టు. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్లు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల బొడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు పంపేవారట గ్రీకులు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా వేసేవారు.
టాటులు పర్మినెంట్, టెంపరరీ రెండు రకాలు ఉంటాయి. టెంపరరీ టాటూ తేలికగా చెరిగిపోతుంది. కానీ పర్మినెంట్ టాటూ పొడిపించుకుంటే చెరపటానికి లేజర్ టెక్నాలజీని ఉపయోగించాల్సిందే. వీటిని తొలగించడానికి టాటూ రిమూవల్ క్రీవ్‌‌సు కూడా అందుబాటులో ఉన్నాయి.
టాటూలో కూడా ఎన్నో థీవ్‌ులు కనిపిస్తుంటాయి. విభిన్నమైన జంతువులు, పక్షులు లేదా మనుష్యుల బొమ్మలను థీవ్‌ుకు అనుగుణంగా మీ చేతులు లేదా భుజాల మీద వేయించుకోవచ్చు. వీటినే పైన్ లైన్ టాటూస్ అంటారు. కొటేషన్ టాటూ అని కూడా ఉంది. ఇందులో మీ కిష్టమైన చిన్న చిన్న కొటేషన్లను టాటూగా వేయించుకోవచ్చు. ట్రైబల్ టాటూ అంటే సాలిడ్ గ్రాఫిక్ డిజైన్లతో మోడరన్ పెయింటింగ్స్‌ను మీ శరరీం మీద టాటూగా వేయించుకున్నారనుకోండి. వాటినే ట్రైబుల్ టాటూస్ అంటారు. న్యూజిలాండ్, జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఇలాంటి టాటూలను వేయించుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో మన దేశంలో కూడా చాలామంది ఈ టాటూస్‌ని ఇష్టపడుతున్నారు. ట్రిబ్యూట్ టాటూ ఏదైనా జరిగిన సంఘటనలకు గుర్తుగానో లేదా మీరు ఇష్టమైన వారికి అంకితమివ్వడం కోసమో మీరు టాటూ వేసుకున్నారనుకోండి అది ట్రిబ్యూట్ టాటూ అవుతుంది.

Comments

comments