Home అంతర్జాతీయ వార్తలు లిఫ్ట్ ఇస్తానన్నాడు… అత్యాచారం చేశాడు

లిఫ్ట్ ఇస్తానన్నాడు… అత్యాచారం చేశాడు

Rape-image

పానాజీ: గోవాలో 20 ఏండ్ల యువతిపై ఓ టాక్సీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గురువారం సాయంత్రం వాస్కో పట్టణ ఎయిర్‌పోర్టుకు 40 కిలో మీటర్ల దూరంలో  చోటు చేసుకుంది. సదరు యువతి వాస్కో ఎయిర్‌పోర్టు రోడ్ లో వెళ్తుంది. అటుగా వెళ్తున్న టాక్సీ డ్రైవర్ రవిచంద్రభట్ భట్ (48) ఆమెను చూసి లిఫ్ట్ ఇస్తానని కారు ఆపాడు. అందుకు యువతి తిరస్కరించింది. దీంతో రవిచంద్ర ఆ యువతిని బలవంతంగా టాక్సీలోకి లాగిపడేసి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతగా అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.