Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘టాక్సీవాలా’ రెండో టీజర్ సూపర్బ్..(వీడియో)

taxi-wala

హైదరాబాద్: యంగ్ హీరో విజయ్ దేవరకొండ బ్లాక్‌బస్టర్ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో కొత్త డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో ‘టాక్సీవాలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జిఎ2 పిక్చర్స్, యూవీ క్రియేఫన్స్ బేనర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.ఇటీవల ఫస్ట్ గేర్ అంటూ రిలీజ్ చేసని టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం చిత్రయూనిట్ మరో టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో విజయ్ శివ పాత్రలో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని మే 18న రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నహాలు చేస్తుంది.మరి తాజాగా రిలీజైన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Comments

comments