Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

అవిశ్వాస నోటీసులిచ్చిన టిడిపి, వైసిపి

LOKSABHA

ఢిల్లీ: పార్లమెంటులో సోమవారం ఉదయం ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో టిడిపి, వైసిపిలు మరోసారి అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని టిడిపి, వైసిపి విప్ జారీ చేసింది. తమకు మద్దతు తెలిసిన ఎంపిలతో టిడిపి సంతకాల జాబితాను సిద్ధం చేసింది. అన్నాడిఎంకె వెనక్కి తగ్గడంతో అవిశ్వాసం నోటీసులపై ఆశలు పెరుగుతున్నాయి.

లోక్ సభలో రెండు వారాలుగా అవిశ్వాసం నోటీసులపై చర్చకు రాలేదని, సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్ నోటీసులను పక్కన పెడుతున్నారు. అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. సభా కార్యకలాపాలు జరిగితే సమాధానం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత కొంతకాలంగా ప్రత్యేక హోదా కోసం టిడిపి, వైసిపి ఎంపిలు  ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు పార్లమెంటు అవరణంలోని గాంధీ విగ్రహం దగ్గర టిడిపి ఎంపిలు నిరసన తెలిపారు.

Comments

comments