Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’పై ఇసికి ఫిర్యాదు

‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’పై ఇసికి ఫిర్యాదు

Lakshmi's NTRఢిల్లీ : ఎన్ టిఆర్ జీవితంలోని కీలక ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’పై టిడిపి నేత దేవిబాబు చౌదరి ఇసికి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. ఈ సినిమాలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని చౌదరి అభ్యంతరం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్‌ పూర్తయ్యే వరకు  ఈ సినిమా విడుదల నిలివేయాలని ఆయన ఇసికి విజ్ఞప్తి చేశారు. దీనిపై  ఈ సినిమా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ లక్ష్మీస్‌ ఎన్ టిఆర్‘ సినిమాను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసిందని, చంద్రబాబును నెగెటివ్‌గా చూపించారని టిడిపి భావిస్తోందని, అయితే నిజాన్ని ఎవరూ దాచలేరన్న విషయాన్ని టిడిపి నేతలు గుర్తు పెట్టుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.

TDP Complaint against ‘Lakshmi’s NTR’