Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

దమ్ముంటే అవిశ్వాసంపై చర్చకు సిద్ధమవ్వాలి

parlamnet
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించింది. లోక్ సభ సెక్రటరీ జనరల్ కు టిడిపి పార్టీ ఎంపి కేశినేని అవిశ్వాసం నోటీసులను అందజేశారు. రాష్ట్ర విభజన హామీలను సాధించుకునే క్రమంలో, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చామని మీడియా సమక్షంలో కేశినేని నాని స్పష్టం చేశారు. అవిశ్వాసాసం ప్రవేశపెట్టడానికి 150 మంది ఎంపిల మద్దతును కూడగడతామని వెల్లడించారు. బిజెపికి సత్తా ఉంటే అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధమవ్వాలని సవాల్ విసిరారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఉండేందుకు గత పార్లమెంటు సమావేశాలను బిజెపి పక్కదోవ పట్టించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments