Home తాజా వార్తలు శ్రీగౌతమి మృతి కేసులో వీడిన మిస్టరీ

శ్రీగౌతమి మృతి కేసులో వీడిన మిస్టరీ

Sri-Gouthami

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీగౌతమి మృతి కేసులో మిస్టరీ వీడింది. 17 నెలల తరువాత గౌతమిది హత్యేనని సిబిసిఐడి తేల్చింది. ఈ హత్య కేసులో టిడిపి నేతలే  ప్రధాన నిందితులుగా ఉన్నారు. నిందితులను పాలకొల్లు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.  2017 జనవరి 18న పాలకొల్లు రూరల్ పరిధిలోని దిగమర్రు వద్ద స్కూటీపై వెళ్తున్న అక్కా చెలెళ్లు శ్రీగౌతమి, పావనిలను నిందితులు ఇన్నోవా కారుతో ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే శ్రీగౌతమి మృతి చెందగా పావని తీవ్రంగా గాయపడింది. పావని స్పృహలోకి వచ్చిన అనంతరం అక్క శ్రీగౌతమిని టిడిపి నేత సజ్జా బుజ్జి హత్య చేశాడంటూ ఆరోపణలు చేసింది. అప్పటి అదనపు ఎస్‌పి రత్న ఈ కేసును విచారించి రోడ్డు ప్రమాదంలో శ్రీగౌతమి చనిపోయిందని తేల్చేశాడు. ఎస్‌పి రత్నతో పాటు అధికారులు కేసును పక్కదారి పట్టించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. శ్రీగౌతమి కుటుంబ సభ్యులకు తెలియకుండ టీడీపీ నేత సజ్జా బుజ్జి  ఆమెను రెండోపెళ్లి చేసుకున్నాడు.