Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నంద్యాలలో… అబ్దుల్ కలాంపై దాడి!?

Nandyala-Bypoll

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా పలు ప్రాంతాల్లో వైసిపి, టిడిపి నేతల మధ్య ఘర్షణ జరిగింది. నంద్యాల 7వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలాంపై టిడిపి సీనియర్ నాయకుడు ఎవి సుబ్బారెడ్డి తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. అక్కిడికి చేరుకున్న వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అబ్దుల్ కలాంను పరామర్శించి వెళ్తుతన్న సమయంలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా వాహనం వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇరు పక్షాలను చెదరగొట్టారు. టిడిపి కార్యకర్తలు దొంగ ఓట్లు వేయిస్తున్నారనీ, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కౌన్సిలర్ అబ్బుల్ కలాంను ఎవి సుబ్బారెడ్డి అనుచురులు దాడికి పాల్పడ్డారు. దీనికి ముందు టిడిపి నేత ఫారుఖ్ ‘నీ సంగతి చూస్తా’అని బెదిరించారని కౌల్సిలర్ ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న శిల్పా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… టిడిపి నాయకులు సృష్షిస్తున్న అరాచకాలను పోలీసులు అడ్డుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాకే స్పందిస్తామని, అప్పటివరకు వైసిపి కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

Comments

comments