Search
Saturday 17 November 2018
  • :
  • :

పెంచిన పెట్రో ధరలు తగ్గించాలి

TDP Leaders Demonds For Petrol Price Decrease

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : ధరలు పెంచుతూ ప్రజలపై తీవ్రభారాన్ని మోపుతున్నారని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తం మండిపడ్డారు. సోమవారం జిల్లా టీడీపి అధ్యక్షుడు నరోత్తం ఆధ్వర్యంలో జాతీయ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పెట్రోల్, డిజీల్ ధరలను రూపాయల్లో పెంచుతూ పైసల్లో తగ్గిస్తు ప్రజలతో ఆడుకుంటుందని తీవ్రంగా మండిపడ్డారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకులపై దాని ప్రభావం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడానికే తప్ప చేసిందేమీ లేదని ఆరోపించా రు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేసి 48 గంటల్లోగా రైతు ఖాతాల్లోకి డబ్బులు పంపుతామని ప్రగల్భాలు పలికారని, ఇప్పటికీ రూ.1500 కోట్లు రైతులకు బకాయిలున్నాయని, వెంటనే ఆ బకాయీలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పండించిన పంటను పూర్తిస్థాయిలో కొంటామన్న ప్రభుత్వం అక్కడక్కడ నామ మాత్రంగా కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలలో నిర్వీర్యం చేసిందన్నారు. 50శాతానికి పైగా పెట్రోల్, డిజీల్‌పై టాక్స్‌ల రూపంలోనే ప్రజల నుండి వసూళ్లు చేసి వారి ఆదాయాన్ని పెంచుకుంటున్నారే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే రైతులకు న్యాయం చేస్తూ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు జడ్‌పిటిసి శ్రీకాంత్‌గౌడ్, మాజీ జడ్‌పి చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, బందెన్నగౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments