Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయబోతున్నాం…

TDP Mps are support to congress candidate rajya sabha deputy chairman

న్యూఢిల్లీ: ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్టు టిడిపి అధిష్టానం నిర్ణయించింది. ఢిల్లీలో టిడిపి పార్టీ ఎంపిలు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బికె హరిప్రసాద్ కు ఓటు వేయాలని అధినేత చంద్రబాబు, తమ పార్లమెంటరీ పార్టీ తరపున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. మరో పక్క పార్లమెంట్ లో పిఎసి సభ్యుడిగా పోటీ చేసిన టిడిపి ఎంపి సిఎం రమేష్ కు కాంగ్రెస్ ఎంపిలు ఓటు వేసిన విషయం తెలిసిందే. ఎన్ డిఎ కూటమి అభ్యర్థిగా జెడియు సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలోకి దిగుతుండగా.. విపక్షాల తరపు అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపి బికె హరిప్రసాద్ పోరులో దిగారు. బుధవారం ఇరువురు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. డిప్యూటీ ఛైర్మన్ పదవిని దక్కించుకొని బిజెపికి గట్టి షాక్ ఇవ్వాలని విపక్షాలు భావిస్తున్నాయి.

Comments

comments