Home ఆంధ్రప్రదేశ్ వార్తలు టిడిపి ఎంపిలు బిజెపి గూటికి

టిడిపి ఎంపిలు బిజెపి గూటికి

 

ఢిల్లీ: తాము బిజెపిలో చేరుతున్నామని టిడిపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టిజి వెంకటేశ్ మీడియాకు తెలిపారు. టిడిపికి రాజీనామా చేసినట్టుగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నలుగురు టిడిపి ఎంపిలు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల నుంచి సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహన్ రావు బిజెపి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం ఉదయం ఆ నలుగురు ఎంపిలు ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షాను కలిశారు. రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని సూచించారు.  పాలక పక్షంలో టిడిపిని విలీనం చేస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా టిజి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. రెండో సారి అధికారంలో వచ్చిన బిజెపిలో తాము చేరుతున్నామని టిజి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తాము బిజెపిలో చేరుతున్నామని చెప్పారు. రాజ్యసభలో బిజెపికి తక్కువ బలం ఉండడంతో ఇలా కలిసి వచ్చే అవకాశం ఉంది. తాను విద్యార్థి దశలో ఎబివిపి నాయకుడిగా పని చేశానని, అప్పటి నుంచి తనకు బిజెపితో సంబంధాలున్నాయిని చెప్పారు. ప్రస్తుతం టిడిపికి రాజ్యసభలో తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌లు మాత్రమే మిగిలారు.

 

TDP MP’s Joined in BJP