Home జాతీయ వార్తలు గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపిల ఆందోళన

గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపిల ఆందోళన

Delhi : TDP MPs Protest At Parliament Infront Of Gandhi Statue

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపిలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎపికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతామని ఎంపిలు స్పష్టం చేశారు. ఎపి పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై రాజీలేని పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఎంపికి న్యాయం జరగేవరకు పార్లమెంట్ వెలుపల, బయట పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు.

TDP MPs Protest At Parliament Infront Of Gandhi Statue