Search
Sunday 23 September 2018
  • :
  • :

భూతగాదాలు.. దళిత మహిళపై దాడి…

Woman-Nacked

అమరావతి: భూవివాదం నేపథ్యంలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసిన దారుణ ఘటన ఎపిలోని విశాఖపట్టణం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో చోటుచేసుకుంది. భూకబ్జాను ప్రశ్నించినందుకు ఓ దళిత మహిళపై స్థానిక టిడిపి నేతలు దాడికి పాల్పడిన దారుణ ఘటన మంగళవారం జరిగింది. రోడ్డుపైకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వివస్త్రగా మార్చారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ఎన్‌టిఆర్ గృహకల్ప పేరుతో టిడిపి నేతలు ఆక్రమించుకునేందుకు యత్నించారు. దీంతో ఓ దళిత మహిళ అడ్డుకుంది. దాంతో కోపోద్రిక్తులైన స్థానియ నేతలు ఆ మహిళపై దాడిచేసి ఆమె బట్టలు చించేశారు. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

TDP workers allegedly harass, tear clothes of Dalit woman.

Comments

comments