Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రోగులకు ఇంజెక్షన్ వేస్తున్న టీకొట్టు యజమాని

Tea-shop-Owner-Inject-to-Pa

ఇప్పటిదాకా ఆయాలు, అటెండర్ల చేత మాత్రమే రోగులకు చికిత్స అందించిన వైద్యులు ఇప్పుడు తాజాగా టీ కొట్టు యజమానిని కూడా ఆ జాబితాలో చేర్చారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో లతీఫ్ అనే టీ కొట్టు యజమాని రోగులకు చికిత్స చేయడం కలకలం రేపుతోంది. ఆసుపత్రి ముందు టీకొట్టు నడుపు తున్న లతీఫ్ కు వైద్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని లతీఫ్ కు అప్పగించిన వైద్యులు చక్కగా తమ ప్రైవేటు ప్రాక్టీసును చేసుకోవడం మొదలుపెట్టారు.
దీంతో ఆసుపత్రిలో ఇతను ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. అక్కడి సిబ్బంది సైతం ఏం అనలేక సైలెంట్ గా పని చేసుకుపోతున్నారు. అయితే లతీఫ్ రోగులకు ఇంజెక్షన్ ఇస్తున్న వీడియోను ఎవరో షూట్ చేసి మీడియాకు అందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో వైరల్‌గా మారడంతో డాక్టర్ల పనితీరుపై నెటిజన్‌లు వారిపై కామెంట్స్ రూపంలో ఆపరేషన్ చేస్తున్నారు.

( https://youtu.be/odCSKAJNPlg )

Comments

comments