Home లైఫ్ స్టైల్ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలి!

పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలి!

Familyపిల్లలకు వేసవి సెలవులోస్తే ఆ సెలవుల్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేయండి. పిల్లలకు తమ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం కంటే ఇష్టమైన పని ఇంకొకటుండదు. అపార్ట్‌మెంట్ సముదాయాల్లో ఉంటున్న లేదా ఎక్కువ ఇళ్ళు కలసి వుండే ప్రదేశాల్లో ఉంటున్న ఆ ఇళ్ళల్లో వున్న పిల్లలంతా కలిసి ఉండేలా ప్లాన్ చేయాలి. పిల్లలు చిన్నతనం వల్ల వాళ్ళంతట వాళ్ళు అందరి ఇళ్ళల్లోకి స్వేచ్చగా వెళ్ళలేకపోవచ్చు. తల్లిదండ్రులందరు కలసి మాట్లాడుకొని పిల్లల్ని ఒక్క చొట చేర్చి, స్విమ్మింగ్, మ్యూజియం, ప్లానిటోరీయం వంటివి సందర్శించడం వంటి కార్యకలాపాలన్నీ ప్రోత్సహించాలి. లేదా దగ్గరలో వున్న పార్క్‌లో ఏదో ఒక సమయంలో అంటి పెట్టుకుని వాళ్ళు కలిసేలా చేయాలి. స్వచ్చంద సేవ, పరిసరాలు శుభ్రం చేయడం ప్రోత్సహించాలి. వాళ్ళకి మంచి మంచి అలవాట్లు నేర్పేది మనమే.

Teach Good Habits to Children