Home జగిత్యాల రక్తదానం చేసి ప్రాణం కాపాడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

రక్తదానం చేసి ప్రాణం కాపాడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

Blood-Donatiion

ధర్మపురి: రక్త హీనతతో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ గర్భిణి స్త్రీ(20)కి ప్రభుత్వ ఉపాద్యాయుడు ఆసం శ్రీనివాస్ బి పాజిటివ్ గ్రూపు రక్త దానం చేసి ప్రాణాన్ని కాపాడాడు. వివరాలిలా ఉన్నాయి. ధర్మపురి మండల కేంద్రానికి చెందిన తొమ్మి నెలలు నిండిన ఓ గర్బిని స్త్రీకి కాన్పు చేయడానికి అర్జెంటుగా రక్తం అవసరం పడింది. నేరెల్ల తిరుపతి యువకనుని ద్వారా రక్తం గ్రూపు వివరాలు ధర్మపురి బ్లడ్ బ్యాంకు వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. మండలంలోని కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయునిగా పనిచేస్తున్న ఆసం శ్రీనివాస్ వాట్సప్ పోస్టుకు స్పందించి జగిత్యాల ఆసుపత్రిలో ఉన్న యువతికి రక్తం దానం చేసాడు. శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.