Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మాస్టర్లే డుమ్మా కొడితే…

Govt-schoolsనిజామాబాద్: మండలం లోని మోకన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంజిమాన్‌ఫారం ఉపాధ్యాయులు బుధవారం రోజున పాఠశాల నుండి మధ్యాహ్నాం నుండే ఇంటికి వెళ్లి పోవడంతో పిల్లలే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను చెబుతున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేక పోవడంతో పిల్లలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ పాఠాలను సక్రమంగా చెప్పక పోవడంతో ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయంపై ఎంఈవో సచిదానందను వివరణ కోసం ఫోన్ చేయగా స్పందించకపోవడం గమన్హారం.

Comments

comments