Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలి

DIG

*కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున గిరిజన ప్రాంతాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్‌పి కల్మేశ్వర్ సింగనెవార్‌తో కలిసి ఆదివాసీ సంఘం నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రోజున బంజార సంఘాల నాయకులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే విషయం పట్ల ఆదివాసీ సంఘం నాయకులతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇరువర్గాలతో మాట్లాడి ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వార్షిక పరీక్షలకు ఆటంకం కల్గకుండా నిర్విరామంగా పాఠశాల తరగతులు జరిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని రెగ్యూలర్ టీచర్‌లు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలని, రెగ్యూలర్ టీచర్‌లు లేని పాఠశాలల్లో సిఆర్‌టి, విద్యావాలంటీర్లు విద్యార్థులకు పాఠాలు బోధించాలన్నారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దీనిని గమనించి ఈ విద్యాసంవత్సరం అయిపోయేంత వరకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు, ఆదివాసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

comments