Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

గురువే దైవం …

Teachers Day Celebrations in India

హైదరాబాద్ : కన్నతల్లిదండ్రుల తరువాత ప్రతి మనిషికి గురువే దైవమని అనాది కాలంగా వినిపిస్తున్న మాటే. కనిపెంచిన తల్లిదండ్రుల తరువాత దైవంతో సమానమైన స్థానం గురువుకే దక్కుతుంది. గురువులను గౌరవించడానికి కొన్ని దేశాల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు కూడా. గురు దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని దేశాల్లో సెలవులు కూడా ఇస్తారు. ఈ క్రమంలో భారత్‌లో సైతం గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్‌డే నిర్వహిస్తూ వస్తున్నారు. 1962లో భారత రెండో రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ పదవీబాధ్యతలు స్వీకరించారు. పుట్టిన రోజును జరిపేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాధాకృష్ణన్‌ను కొందరు కోరారు. అందుకు ఆయన స్పందించారు. తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరిపేకంటే, సెప్టెంబర్5న టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న టీచర్స్‌డే నిర్వహిస్తున్నారు. టీచర్స్‌డే రోజున భారత్‌లో సెలవు దినంగా ప్రకటించలేదు. అయితే ఈ రోజు రోజువారీ బోధనలు జరగడం లేదు. ఆరోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

గురువు, దేవుడు కనిపిస్తే, ఎవరికి ముందుగా నమస్కరిస్తారన్న సందేహం తలెత్తినప్పుడు, ముందుగా గురువుకే నమస్కారం పెడుతామన్నది భారత సంప్రదాయంగా వస్తోంది. ఆధ్యాత్మిక గురువుకు, భౌతిక విషయాలను బోధించే గురువుకు తేడా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుల ఆలోచనల్లో ఉన్న భ్రమలను తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్లీస్తాడు. భౌతిక విషయాలను బోధించే గురువులు లోకజ్ఞానంపై, భౌతిక విషయాల్లో తమ శిష్యులను చైతన్యం చేస్తారు. ఈ క్రమంలోనే గురువు పరబ్రహ్మ స్వరూపమని భారతీయులు నమ్ముతుంటారు. టీచర్స్‌డే నాడు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో పాటు మరో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్మరించుకోవాల్సిందే. అణుబాంబు సృష్ఠికర్త అబ్దుల్ కలాం ప్రొఫెసర్‌గానే కాకుండా పలు వేదికలపై ఉపన్యాసాల రూపంలో ఎంతో మందిని చైతన్యం చేశారు. టీచర్స్‌డే సందర్భంగా రాధాకృష్ణన్‌తో పాటు అబ్దుల్‌కలామ్‌కు నివాళులు అర్పిద్దాం.

Teachers Day Celebrations in India

Comments

comments