Home జాతీయ వార్తలు ఇదేం ఘోరం…ఇదేం శిక్ష..!!

ఇదేం ఘోరం…ఇదేం శిక్ష..!!

Mumbai-Punishmentముంబయి : సాధారణంగా విద్యార్థులు తప్పులు చేస్తే ఉపాధ్యయులు శిక్షిస్తారు. ఇది అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టీచర్ల వ్యవహారం మరీ మితిమీరిపోతుంది. పిల్లలు తప్పు చేస్తే వాతలు తేలేలా కొట్టడం, ఇంకా చాలా భయంకరమైన శిక్షలు విధిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులు. ఇలాంటి దుర్ఘటనే ముంబయిలో చోటు చేసుకుంది. సరిగ్గ చదవడంలేదనే కారణంతో ఇద్దరు విద్యార్థులను బట్టలు లేకుండా (ఒక విద్యార్థిని పూర్తి నగ్నంగా, మరో విద్యార్థి టి షర్ట్‌తో) రోడ్డు పై నిలుచోబెట్టారు ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన ఉపాధ్యాయులు. 5-6 సంవత్సరాలు గల ఈ విద్యార్థులకి ఇచ్చిన పనిష్‌మెంట్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిన్నారులు సిగ్గుతో తల వొంచుకొని, కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్న ఈ దృశ్యాలు అందరి మనసులకి కలచి వేస్తున్నాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకున్నట్లు కొందరు ఎన్‌జివొలు తమకు సమాచారం అందిచారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కోచింగ్ సెంటర్ సిబ్బంది పై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.