Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా బోధన

mike

*అవగాహన శక్తి పిల్లల్లో పెంపొందించేలా చూడాలి
*పిల్ల సత్ఫలితాలకు అంగన్‌వాడీలు కృషిచేయాలి : కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్

మన తెలంగాణ/సంగారెడ్డి ప్ర తినిధి : అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల అవగాహన శక్తిని పెం పొందించేలా మంచి వాతావరణాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అజీమ్ ప్రేమ్‌జీ పౌండేషన్ నిర్వహించిన పూర్వ ప్రాథమిక విద్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడి టీచర్లు విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్యను బోధించేటపుడు వాళ్ల స్థాయిలో కాకుండా పిల్లల స్థాయికి వెళ్లి బోధించాలన్నారు. చిన్నారులు నిష్కల్మషంగా ఉంటారని, వారికి చిన్న వయస్సులో బోధించిన విషయాలు జీవితాంతం గుర్తుండి పోతాయన్నారు. ప్రతి రోజు అంగన్‌వాడి కేంద్రానికి వెళ్లే టీచర్లు చిన్నారులకు అహ్లాదమైన వాతావరణాన్ని కల్పించాలనే ధృడ సంకల్పంతో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు తాము చేసే పనిని గౌరవించినప్పుడే ఆ పనిలో నిమగ్నమవడమే కాకుండా సత్ఫలితాలు సాధించేదుకు అస్కారం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల సర్వోతోముఖావృద్ధికి ఆయా సిబ్బంది శక్తి వంచన లేకుండా కృషిచేయాలన్నారు. సమాజంలో అంగన్‌వాడీ కేంద్రాలంటే భోజన సదుపాయం కల్పించే కేంద్రాలని అపోహ ఉందని, ఆ అపోహను తొలగించి పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులు సద్వినియోగపర్చుకునేలా చూడాలన్నారు. తద్వారా చిన్నారులలో దృఢత్వం, గ్రహణ శక్తి పెరిగేందుకు అవకాశముంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఈ లోటును భర్తీ చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారుల భావి జీవితానికి పునాధులు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అంగన్‌వాడీ సిబ్బంది చిన్నారులతో కలిసి పని చేయడం ఒక సదావకాశంగా భావించి వారికి సేవలందించాలని కలెక్టర్ సూచన చేశా రు. ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ లక్ష్మీ, జిల్లా సంక్షేమాధికారి మోతీ, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతినిధి జిగీషాశాస్త్రీ, డిసిపీవో రత్నం, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments