Search
Saturday 17 November 2018
  • :
  • :

రెండో టి20కి జట్టులో మార్పు తథ్యం: కోహ్లి

vrt

మలహైడ్(డబ్లిన్): టీమిండియా, ఐర్లాండ్‌తో ఆడబోయే రెండో అంతర్జాతీయ టి20లో మా ర్పు తథ్యం అని తెలుస్తోంది. శుక్రవారం ఆడబోయే ఈ రెండో టి20లో భారత జట్టు సంపూర్ణ సంతులనం కోసం మార్పులు చేయబోతున్నది. భారత జట్టు తన మూడు నెలల ఐర్లాండ్, ఇం గ్లాండ్ పర్యటనను బుధవారం 76 పరుగులతో ఐర్లాండ్‌పై గెలిచి శుభారంభం చేసింది. తొలి టి20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లు అర్ధశతకాలు చేయడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కాగా కుల్దీప్ యా దవ్, యుజ్వేంద్ర చాహల్ కలిసి ఏడు వికెట్లు తీసుకోవడమేకాక ఐర్లాండ్‌ను 9 వికెట్లకు 132 పరుగులకే కట్టడి చేశారు. మూడు నెలల విరా మం తర్వాత ఎంపిక చేసిన 11 మంది క్రికెటర్ల జట్టు బాగానే ఆడుతోంది. ఇంగ్లాండ్‌కు వెళ్లేలోగా బాగానే సన్నద్ధం అవుతోంది. కాకపోతే మొత్తం జట్టు బలం గురించే ప్రశ్నంత. కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, ఉమేశ్ యాదవ్ వంటి వారికి అవకాశం ఉంటుందా అన్నదే ప్రశ్న. ‘.. మేము మిడిల్ ఆర్డర్‌లో మార్పు ప్రయోగం చే యాలనుకుంటున్నాం. జట్లులోని అందరికీ ఆడే అవకాశం దక్కాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటుకునేందుకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే విదేశీ ప ర్యటనకు వెళ్లే జట్టులో చాలా మందికి ఎప్పుడూ ఆడే అవకాశం దక్కదు’ అని మొదటి టి20 మ్యాచ్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. ఇంగ్లాండ్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు త్వరగానే చేయడం జరుగుతుందనిపిస్తోంది. బౌలింగ్ సహా మొత్తం జట్టులో మార్పు ఉంటుందా? అన్న ప్రశ్నకు కోహ్లి జవాబు చెప్పలేదు. ఐర్లాండ్‌తో మొదటి టి20 ముగిశాక కో హ్లి మాట్లాడుతూ ‘ జట్టును పరిశీలించాక, మా ర్పు తథ్యం అనేది స్పష్టం’ అన్నాడు. అదే సమయంలో జట్టులో రోహిత్, ధవన్, ధోని సహా తా ను, మరి ఇద్దరు లెగ్‌స్పిన్నర్లు యథాతథంగా ఉండనున్నారని అన్నాడు. ఐర్లాండ్, భారత్‌ల మధ్య శుక్రవారం జరిగే రెండో టి20లో అప్‌సెట్ అనేది అసాధ్యం. కానీ ఐర్లాండ్ జట్టుకు వా రి సొంత గడ్డ అనుకూలం కాగలదు. స్థానిక అ భిమానులు కూడా వారికి అండగా ఉండనున్నా రు. ఈ నేపథ్యంలో వారు ఏమైనా చేసినా ఆశర్యపడాల్సిందంటూ ఏమీ లేదు.
జట్లు అంచనా
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్.
ఐర్లాండ్: గ్యారీ విల్సన్(కెప్టెన్, వికెట్‌కీపర్), ఆండ్రూ బాల్బిర్నీ, పీటర్ చేస్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, ఆండీ మెక్‌బ్రైన్, కెవిన్ ఓబ్రిన్, విలియం పోర్టర్‌ఫీల్డ్, స్టూవర్ట్ పాయింటర్, బోయ్డ్ రాంకిన్, జేమ్స్ షన్నాన్, సిమీ సింగ్, పాల్ స్లిర్లింగ్, స్టూవర్ట్ థామ్సన్.

Comments

comments