Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఒకే మ్యాచ్‌లో మూడు అరుదైన రికార్డులు

MS-Dhoniమొహాలీ : టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోని 9 వేల పరుగులల వ్యక్తిగత స్కోర్ పూర్తి చేశాడు. న్యూజిలాండ్‌తో మొహాలీలో జరుగుతున్న మూడో వన్డేలో శాంట్నర్ బౌలింగ్‌లో ధోనీ సిక్సర్ బాదడంతో 9వేల పరుగుల మైలు రాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా, ప్రపంచంలో 17వ బ్యాట్స్‌మెన్‌గా, మూడో వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇంతకు ముందు టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్, గంగూలీ, డ్రావిడ్, అజరుద్దీన్ ఈ రికార్డు నమోదు చేశారు. 50కి పైగా సగటుతో 9వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్‌గా ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ధోనీ 281 వన్డేల్లో 51.15 సగటుతో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అంతేకాక, అత్యధికంగా స్టంప్ లు చేసిన కీపర్ గా కూడా ధోని రికార్డు నెలకొల్పాడు. కెరీర్ లో 150 స్టంప్ లు చేసిన వికెట్ కీపర్ గా ధోని చరిత్ర సృష్టించాడు. వీటితో పాటు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగ కూడా ధోని రికార్డు సాధించాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న 195 సిక్సర్ల రికార్డును 196 సిక్సర్లతో ధోని బద్దలుకొట్టాడు. ధోని సాధించిన ఈ విజయం పట్ల పలువురు సీనియర్ ఆటగాళ్లు ఆయన్ను అభినందించారు.

Comments

comments