Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కోహ్లీ మనిషే.. మెషీన్ కాదు: రవిశాస్త్రి

Team India Coach Ravi Shastri says Virat Kohli is human, not a machine

ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెనకెసుకొచ్చారు. అతడు మనిషేనని, మెషీన్ కాదని, అతడికి విశ్రాంతి అవసరమన్నారు. గత కొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ ఐపిఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి మెడకు గాయమైంది. దీంతో కోహ్లీ కౌంటీ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. మెడ గాయం కారణంగా వైద్యులు కోహ్లీకి మూడు వారాల విశ్రాంతి అవసరమని చెప్పడంతో సర్రే జట్టుతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు సర్రేకు ఆడటం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని విరాట్ భావించాడు. కానీ ఉన్నట్టుండి మెడకు గాయం కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అయితే విరాట్ టాప్ ఆటగాడు అయినంత మాత్రాన అతడి వెనుక రాకెట్ ఇంధనాన్ని నింపి మైదానంలో వదలలేం కదా అని రవిశాస్త్రి అన్నారు. కోహ్లీకి గాయం కావడం పట్ల సర్రే జట్టు యాజమాన్యం తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. చాలా కాలంగా కౌంటీల్లో కోహ్లీ ఆడటం చూడాలని ఆశించిన అభిమానులకు ఇది నిజంగా చేదు వార్తని ఆ జట్టు యాజమాన్యం పేర్కొంది. విరామం లేకుండా గత ఏడాది కాలంలో విరాట్ ఏకంగా 9 టెస్టులు, 30 వన్డేలు, 9 టీ20లతో పాటు 14 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడటం విశేషం.

Comments

comments