Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కివీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

bcci

ముంబయి: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల అనంతరం టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సోమవారం ఈ మూడు టీ20ల కోసం బిసిసిఐ జట్టును ప్రకటించింది. అయితే ఈ సిరీస్ కోసం హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయడం విశేషం. అతనితో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా సెలక్టయ్యాడు. ఇక సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రాను కూడా ఎంపిక చేశారు. ఢిల్లీలో జరిగే తొలి టీ20 అనంతరం నెహ్రా తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కొలు పలకనున్న విషయం తెలిసిందే.

టీ20కు భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, మహ్మద్ సిరాజ్.

అలాగే కివీస్ పర్యటన అనంతరం శ్రీలంక జట్టు భారత్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా లంక మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇక శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు కూడా టీమ్‌ను ఎంపిక చేశారు. ఇందులో రహానేను వైస్ కెప్టెన్‌గా నియమించారు. నవంబర్ 16 నుంచి కోల్‌కతాలో మూడు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ సిరీస్ పూర్తవగానే శ్రీలంక భారత్ రానుంది.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ టీమ్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), కెఎల్ రాహుల్, మురళి విజయ్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.

Comments

comments