Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

BCCI-2

ముంబయి: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు బిసిసిఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. కెప్టెన్ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించారు. ఇక టెస్టు సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఆలౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. కొత్త కుర్రాడు సిద్దార్థ్ కౌల్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. 15 మంది సభ్యులు గల టీమిండియా వివరాలు ఇలా ఉన్నాయి. అలాగే మిగిలిన ఒక టెస్టుకు కూడా జట్టును ఎంపిక చేసింది.

వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్.

టెస్టుకు భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, విజయ్ శంకర్.

Comments

comments