Friday, April 26, 2024

భారత్ కు ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

Team India lost 7 wickets and scored 294 runs

 

సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం

n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండోరోజూ ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 294 పరుగులు చేసి, 89 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 24/1తో రెండోరోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన 40 పరుగుల వద్ద చటేశ్వర్ పుజారా (17) వికెట్‌ను కోల్పోయింది. జాక్ లీచ్ బౌలింగ్‌లో పుజారా ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (0) పరుగులేమీ చేయకుండానే స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి క్రీజును వదిలాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానెతో కలిసి ఓపెనర్ రోహిత్ శర్మ స్కోరును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్న క్రమంలో అజింక్య రహానె అండర్సన్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులలోకి వచ్చిన రిషభ్ పంత్ వచ్చి రావడంతోనే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అహ్మదాబాద్ : ఓవైపు పంత్ చెలరేగి ఆడుతుండగానే రోహిత్ శర్మ (49) అర్ధ సెంచరీకి పరుగు దూరంలో స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటై క్రీజును వదిలాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (13) కూడా తొందరగానే అవుటయ్యాడు. అప్పటికీ భారత్ 5 వికెట్లను కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి పంత్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా 86 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తిచేశాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ సైతం అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపడంతో జట్టు స్కోరు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో పంత్ 94 పరుగుల వద్ద రూట్ బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

పంత్‌కు ఇది ఓవరాల్‌గా మూడో సెంచరీ కాగా, సొంత మైదానంలో ఇదే మొదటిది. అయితే సెంచరీ సాధించిన కొద్దిసేపటిక్ పంత్ (101) రూట్ బౌలింగ్‌లోనే అవుటవ్వడం విశేషం. మరోవైపు వాషింగ్టన్ సుందర్ (60, బ్యాటింగ్) స్టోక్స్ వేసిన 87వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాది అర్ధ సెంచరీ పూర్తి చేసున్నాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 89 పరుగుల ఆధిక్యంలో నిలవగా, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అక్షర్ పటేల్ (11) క్రీజులో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా, బెన్ స్టోక్స్, జాక్ లీచ్ తలా రెండేసి వికెట్లను తీసుకున్నారు.

రోహిత్ రికార్డులు..

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు. వరల్ టెస్టు చాంపియన్‌షిప్ మొదలైన తర్వాత అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాక టెస్టులో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తిచేసిన మొదటి ఆసియా ఓపెనర్‌గా, టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరఫున వేగంగా వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న తొలి ఆటగాడిగా వినోద్ కాంబ్లి (14 ఇన్నింగ్స్‌లు) రోహిత్ కంటే ముందు వరుసలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో పుజారా(18), మయాంక్ అగర్వాల్ (19) కొనసాగుతున్నారు.

కోహ్లీ చెత్త రికార్డు..

అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. కొంత కాలంగా ధోనీ రికార్డులను వేటాడుతున్న విరాట్.. ధోనీ చెత్త రికార్డును సమం చేయడం ఇక్కడ విశేషం. నాలుగో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ (౦) పరుగులేమీ చేయకుండానే స్టోక్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఎనిమిది సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు. ఇక టెస్టుల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇది 12వ సారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News