Home తాజా వార్తలు దుబాయి చేరుకున్న టీమిండియా

దుబాయి చేరుకున్న టీమిండియా

Team India reaches Dubai for Asia Cup 2018

దుబాయి: ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు దుబాయి చేరుకుంది. ఈ టోర్నీలో టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు కూడా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. భారత్ కంటే ముందే మిగతా జట్లన్నీ ఇప్పటికే దుబాయి చేరుకున్నాయి. గురువారం దుబాయి బయల్దేరిన టీమిండియా సభ్యుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యజువేంద్ర చహల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్ తదితర ఆటగాళ్లు ఉన్నారు. ఇక దుబాయి విమానాశ్రయానికి చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వాహకులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు. అప్పటికే అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నఅభిమానులు టీమిండియా ఆటగాళ్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఈ టోర్నీలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిసిసిఐ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసింతే. ఆసియా కప్ ఆడే భారత జట్టు  వివరాలు ఇలా ఉన్నాయి.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ, దినేష్ కార్తీక్, హర్దీక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.

Telangana Breaking News