Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

టీమిండియా ముమ్మర కసరత్తు..

india

బెంగళూరు: అఫ్గానిస్థాన్‌తో జరిగే చారిత్రక టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా జట్టు సోమవారం సాధన ప్రారంభించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు కూడా సాధన ప్రారంభించిన విషయం తెలిసిందే. గురువారం నుంచి బెంగళూరు వేదికగా భారత్‌అఫ్గాన్‌ల మధ్య చారిత్రక టెస్టు మ్యాచ్ జరుగునుంది. ఇప్పటి వరకు వన్డేలు, టి20లకు మాత్రమే పరిమితమైన అఫ్గాన్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టు ఫార్మాట్‌కు శ్రీకారం చుట్టనుంది. భారత్ రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండానే టెస్టుకు సిద్ధమైంది. జట్టుకు అజింక్య రహానె సారథ్యం వహిస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టనుంది. దీంతో ఆటగాళ్లందరూ బెంగళూరుకు చేరుకున్నారు. సోమవారం కఠోర సాధన చేశారు. కోచ్ రవిశాస్త్రి, అతని సహాయకుల పర్యవేక్షణలో సాధన కొనసాగింది. ఐపిఎల్ తర్వాత భారత ఆటగాళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. విరామం లభించడంతో అఫ్గాన్ టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యే అవకాశం వారికి దక్కింది. కోహ్లి, భువనేశ్వర్, బుమ్రా, రోహిత్ శర్మ తదితరులు లేకుండానే భారత్ ఈ టెస్టుకు సిద్ధమైంది. రషీద్ ఖాన్, ముజీబుర్ రహమాన్, మహ్మద్ నబి తదితరులతో అఫ్గాన్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్‌తో భారత్‌కు ప్రమాదం పొంచివుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రషీద్ విజృంభిస్తే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయం. అయితే రహానె, ధావన్, విజయ్, పుజారా, కరుణ్ నాయర్, రాహుల్, కార్తీక్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ఇషాంత్, ఉమేశ్, షమి, అశ్విన్, జడేజా తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో భారత్ ఫేవరెట్‌గా మ్యాచ్‌కు సిద్ధమైంది.

Comments

comments