Search
Friday 16 November 2018
  • :
  • :

కోచ్‌లు కాదు.. జట్టే శాశ్వతం : రవిశాస్త్రి

BCCIముంబయి : కోచ్‌లు వస్తుంటారు..పోతుంటారు, కానీ జట్టు శాశ్వతమైందని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రా యపడ్డాడు. రవిశాస్త్రి, అనిల్‌కుంబ్లే లాంటి ఎందరో కోచ్‌లు జట్టుకు సేవలు చేస్తారు..వెళ్లిపోతారు. అయితే జట్టు మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని శాస్త్రి అన్నాడు. శ్రీలంక సిరీస్ కోసం టీమిండియా బుధవారం బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో రవి కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు. జట్టుకు కోచ్ ఎవరన్నది కీలకం కాదన్నాడు. కానీ జట్టు నిలకడగా ఆడడమే చాలా ప్రధానమైన అంశమన్నాడు. తనకు అప్పగించిన బాధ్యతల ను సక్రమంగా నిర్వర్తిస్తాననే నమ్మకం ఉందన్నాడు. తాను పరిణితి సాధించిన వ్యక్తి అని పేర్కొన్నాడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో తెలుసన్నాడు. ప్రస్తుతం టీమిండి యా జోరుమీదుందని, దాన్ని మరింత మెరుగైన జట్టుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్షమన్నాడు. గతంలో కూడా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిం చాను. ఈసారి మరింత మెరుగ్గా బాధ్యతలను నిర్వర్తిస్తాను. కాగా, కోచ్ పదవి కోసం తాను ఎవరిని కాకా పట్టలేద న్నాడు. తనకు అన్ని అర్హతలు ఉండడం వల్లే కీలకమైన ఈ పదవి దక్కిందన్నాడు. కాగా, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కోసం తాను ఎలాంటి లోపాయికారి ప్రయత్నాలు చేయలే దన్నాడు. అతనిలో సత్తా ఉండడం వల్లే ఈ బాధ్యతలను భారత బోర్డు అప్పగించిందన్నాడు. కాగా, కోచ్‌గా జట్టును సరైన మార్గంలో ముందుకు నడిపిస్తానని, దీని కోసం అందరి సహకారం తీసుకుంటానని రవిశాస్త్రి వివరించాడు.
నా చేతిలో ఏమీలేదు : కోహ్లి
కోచ్ ఎంపికలో తాను చక్రం తిప్పినట్టు వచ్చిన వార్తలను భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తోసి పుచ్చాడు. తన చేతిలో బ్యాట్ తప్ప ఏమీలేదని ఓ ప్రశ్నకు చురుకుగా సమాధానం చెప్పాడు. రవిశాస్త్రి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా డనే నమ్మకం ఉండడంతో బోర్డు అతన్ని ఎంపిక చేసిందన్నా డు. ఇందులో ఎవరి జోక్యం లేదన్నాడు. తాను చక్రం తిప్పే స్థాయికి ఇంకా చేరుకోలేదన్నాడు. తన దృష్టంతా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంపైనే ఉంటుంద న్నాడు. కిందటిసారి తాము లంకలో సిరీస్ గెలిచామని, ఈసారి కూడా గెలుస్తామనే నమ్మకం ఉందన్నాడు. కాగా, కొంతకాలంగా భారత క్రికెట్‌లో నెలకొన్న పరిస్థితుల ప్రభావం ఆటపై పడుతుందని తాను భావించడం లేద న్నాడు. సమష్టి కృషితో శ్రీలంకను ఓడించేందుకు ప్రయ త్నిస్తమని కోహ్లి అన్నాడు. కాగా, రవిశాస్త్రితో కలిసి గతంలో చాలా ఏళ్లు పనిచేశామని, ఇది తమకు కలిసి వచ్చే అంశమ న్నాడు. లంకతో సిరీస్ తమకు చాలా కీలకమైందన్నాడు. ఇందులో గెలిస్తే జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని కహ్లి అభిప్రాయపడ్డాడు. కాగా, తనపై మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోవడం లేదన్నాడు. దానికి అంత ప్రాధా న్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నాడు. క్రికెట్‌లో ఇటువంటి పరిస్థితుల సదా ఉంటాయని, దాన్ని సీరియ స్‌గా తీసుకుంటే ముందుకు సాగడం చాలా కష్టమని కోహ్లి అభిప్రాయపడ్డాడు.

Comments

comments