Home పెద్దపల్లి ఆయకట్టు చివరి రైతు కంట కన్నీరు

ఆయకట్టు చివరి రైతు కంట కన్నీరు

  • టేలెండ్ భూములకందని కాల్వ నీళ్ళు
  • 2 వేల ఎకరాల్లో ఎండిపోయిన వరి
  • 2 మండలాల్లో బోరుమంటున్న అన్నధాత
  • మానేరులో అపర భగీరథ ప్రయత్నం
  • మొదలయిన రైతుల ఆత్మహత్యలు
  • నెల రోజుల్లో ముగ్గురు రైతుల మృతి

Basin-Waterపెద్దపల్లి : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాల్వ నీటి పై ఆధార పడి యాసంగి లో వరి సాగు చేసిన ఆయకట్టు చివరి రైతు కంట కన్నీరు ఒలుకుతోంది. ఆయకట్టు చివరి భూములకు నీరందక పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, ఒదెల మండలాల్లో 2వేల ఎకరాల్లో వరి ఎండి పోయింది. మరో పక్షం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే మరో 2వేల ఎకరాలు కూడా చేతి కందకుండా పోనుంది. 8 రోజులు ఆన్ 6 రోజులు ఆఫ్ పద్ధతిలో నీరు విడుదల చేయడం వలన ఆయకట్టు చివరి భూములకు నీరు చేరడం లేదు .ఒదెల మండలంలోని 17 గ్రామాలకుగాను మానేరు వాగును ఆనుకొని ఉన్న, గుంపుల, గూడెం, ఇందుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండ లంలోని మొత్తం 15 గ్రామాలకు నీరందడం లేదు . కళ్ళ ముందే ఎండిపోతున్న వరి పంటను రక్షించుకునేందుకు రైతులు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నా, ఉహించని రీతిలో గత నాలుగు నెలల నుండి వర్షాలు పడకపోవడంతో భూగర్బ జలాలు అడుగంటి చుక్కనీరు రావడంలేదు . మానేరు నదీ తీర గ్రామాల రైతులు వాగులో హైండ్ బోర్లు వేసి, కీలోమీటర్ల కొలది పైపులేసుకొని పంటను దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సాగు చేసిన పంటలో కొంత మొత్తాన్నైనా కాపాడుకోవాలనే చివరి ప్రయత్నంలో ఎండిపోయి, పంట కోసం చేసిన అప్పులు కళ్ళముందు కదలాడి రైతులు ఆత్మ హత్యలకు ఒడిగడుతున్నారు. గడిచిన నెల వ్యవదిలో కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఇద్దరు రైతులు , ఒదెల మండ లంలో ఒక రైతు ఆత్మ హత్యకు పాల్పడడం జరిగింది . ఆయకట్టు చివరి భూముల్లో యాసంగి వరి సాగుకు పూర్తి స్థాయిలో కాల్వ నీళ్ళిస్తామని రైతులను వరి సాగుకు ప్రోత్సహించిన ప్రజాప్రతినిదులు ,అధికారులు నేడు అటు వైపు తొంగి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు . అత్మస్థైర్యం కోల్పోయి ,ఆత్మహత్యల వైపు అడుగులేస్తున్న అన్నధాతలను గుండెలకత్తు కోవాల్సిన అమాత్యులు ,అధికార ఘనం మొఖం చాటేస్తున్నారు .నష్టపోయిన పంటను అంచనా వేసి పరిహరం చెల్లించేందుకు ప్రణాళికలు రూపొందించి, రైతులకు మేమున్నామనే భరోసా కల్పించాలని కోరుతున్నారు .
నెల రోజుల్లో ముగ్గురు రైతుల ఆత్మహత్య
కాల్వ శ్రీరాంపూర్, ఒదెల మండలాల్లో గడిచిన నెల రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారు. శ్రీరాంపూర్ మండలం మొట్ల పల్లికి చెందిన రూప్‌రెడ్డి సమ్మిరెడ్డి తనకున్న నాలుగెకరాల్లో వేసిన పంట దెబ్బతినడంతో కుంగి పోయి 20 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా , గంగారం గ్రామానికి చెందిన దామ రాజయ్య రెండెకరాల పొలం ఎండిపోయి దిగులుతో వారం రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన లింబాల కుమార్ అనే యువ రైతు పంట దెబ్బతినడంతో వారం క్రితం క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించాడు. చనిపోయిన కుమార్‌కు 10 ఏళ్ళలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు. వేసిన పంటలు ఎండిపోగా చేసిన అప్పులు తీర్చేదారిలేక రైతులు ఆత్మహత్యలను ఆశ్రయి స్తున్నారు.
నీళ్ళిచ్చి పంటలను ఆదుకోండి
-రైతు మహేందర్
ఎండి పోయిన పొలాలు ఎలాగు ఎండి పోయినయి ఉన్న పొలాలకు పూర్తి స్థాయి నీరందించి పంటలను కాపాడాలని కాల్వశ్రీరాంపూర్ మండ లం గంగారం గ్రామానికి చెందిన మహేందర్ అనే రైతు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఆయకట్టు చివరి భూముల్లో యాసంగి వరి సాగుకు పూర్తి స్థాయిలో కాల్వ నీళ్ళిస్తామని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధి కారులు ప్రకటించిన తరువాతే తాము యాసంగి లో వరి సాగుకు పూనుకున్నామని తీరా పంట మధ్య దశలో నీరందక ఎండిపోతుంటే, అధికా రులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపిం చారు. యాసంగి పంట పూర్తయ్యే వరకు నీరందిం చి ఆదుకోవాలని ఆయన అధికారులను కోరారు .
కాల్వ నీళ్ళిచ్చి కాపాడండి
-మహిళా రైతు లక్ష్మి
వారం బంజేసి వారం ఇచ్చుడు గాకుండా ఇంకా రెండు నెలలు పొలాలయ్యేదాక కాల్వ నీళ్ళిచ్చి పంటలను కాపాడాలని ఒదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మి ఆన్నారు .వార బందితోని కింది పొలాలకు నీళ్ళు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆమె అన్నారు . తాను 4 ఎకరాల్లో వరి సాగు చేశానని 2 ఎకరాలు ఎండిపోగా మరో రెండెకరాల్లో పూర్తి స్థాయిలో తడికి నీరందడం లేదని అవేదన వ్యక్తం చేసింది . పంట నష్ట పోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది .
నష్టపరిహారం చెల్లించాలి
-ఎంపిటిసి వెంకటేశ్
కాల్వశ్రీరాంపూర్, ఒదెల మండలాల ఆయకట్టు చివరి భూముల్లో యాసంగి వరి సాగుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాల్వ నీళ్ళిస్తామని అటు ప్రజా ప్రతిని ధులు ఇటు అధికారులు ప్రకటించిన తరువాతే రైతులు వరి సాగు చేశారని నాట్లప్పుడు నీరందక కొంత, తీరా పంట మధ్యలో ఉన్న కాస్త పంట ఎండి పోతున్నా ఎవరు పట్టించు కోవడం లేదని సుందిళ్ళ ఎంపిటీసి వెంకటేశ్ ఆరోపించారు. నష్టపోయిన ప్రతి ఎకరానికి 15వేల నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 20 లక్షల చొప్పున అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.