Search
Saturday 17 November 2018
  • :
  • :

వరంగల్‌లో టెక్ మహీంద్రా కేంద్రం

TECH-MAHENDRA

దావోస్ : తెలంగాణలోని వరంగల్‌లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. తెలంగాణకు పెట్టుబడులు సాధించాలన్న ఆలోచనతో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కెటిఆర్ టెక్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో భేటీ అయ్యారు. తెలంగాణలో పరిశ్రమను స్థాపించాలని ఆయన ఆనంద్ మహీంద్రాను కోరారు. కెటిఆర్ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. వరంగల్‌లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆనంద్ తీసుకున్న నిర్ణయంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేసి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో టెక్ మహీంద్రా సంస్థ సిఇఒ సిపి గుర్నానీ, తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.

Tech Mahindra Center in Warangal

Comments

comments