Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

భార్య జల్సాలు భరించలేక.. పోలీసులకు ఫిర్యాదు!

Techie filed harassment complaint against wife in Bengaluru

బెంగళూరు: జల్సాలకు అలవాటు పడిన భార్య విచిత్ర వేధింపులతో తనను హింసిస్తుందని ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించిన సంఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. మద్యంతో పాటు స్మోకింగ్ చేస్తూ భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేస్తుందని, లేని పక్షంలో గృహ హింస కేసు పెడతానని తన భార్య బెదిరింపులకు పాల్పడుతుందంటూ టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే… బెంగళూరులో ఓ సాప్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ధీరజ్‌ రెడ్డికి 2014లో జయశ్రుతి అనే యువతితో పెద్దలు వివాహం జరిపించారు.  రెండేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, మద్యానికి బానిసైన జయశ్రుతి భర్తను వేధించడం ప్రారంభించింది. తనకి రూ.30 లక్షలు విలువచేసే వజ్రాభరణాలు కొనివ్వాలని లేకుంటే.. ఆత్మహత్య చేసుకుంటానని, అలాగే తన ఖర్చుల నిమిత్తం రూ. 2 కోట్లు ఇవ్వాలని వేధిస్తునట్లు ధీరజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. విషయం అత్తింటివారికి చెబితే వారు కూడా భార్యకే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో చేసేదేమిలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధీరజ్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణకు రావాలని భార్యతో పాటు ఆమె ఆరుగురు కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు.

Comments

comments